Monday, December 23, 2024
HomeMovie Newsజనవరి 13 న తండేల్..నిర్మాత ఏమన్నా ప్లానా..?

జనవరి 13 న తండేల్..నిర్మాత ఏమన్నా ప్లానా..?

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. వాస్తవిక సంఘనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ రోజునే ఎందుకు అనేది దానికి నిర్మాత గట్టి ప్లానే చేసాడు.రిలీజ్ రోజున భోగి ఉండడంతో పాటు ఆ తర్వాత వరుసగా పండుగ సెలవులతో పాటు వీకెండ్ కూడా రానుంది. ఒకసారి హాలిడేస్ ను గమనిస్తే జనవరి 13 – భోగి జనవరి 14 – సంక్రాంతి జనవరి 15 – కనుమ జనవరి 16 – ముక్కనుమ జనవరి 17 – శుక్రవారం జనవరి 18 – శనివారం జనవరి 19 – ఆదివారం భోగి రోజు దిగితే మాత్రం తండేల్ కు పర్ఫెక్ట్ డేట్. అందుకే ఆ డేట్‌ను ఫిక్స్ చేశారని అంటున్నారు. ఒకవేళ ఈ మూవీకి మౌత్ టాక్ మంచిగా వస్తే ఈ మూడు రోజుల్లోనే లాభాల బాటలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. మరి సెలవులను చైతు కాష్ చేసుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read