‘ఛావా’కి తెలుగు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇది కేవలం సినిమా కాదు..గొప్ప ఎమోషన్. తల్లిదండ్రులు దయచేసి ‘ఛావా’ని పిల్లలకు చూపించాలని కోరుకుంటున్నాను: థాంక్ యూ మీట్ లో నిర్మాత బన్ని వాస్
థాంక్ యూ మీట్ లో నిర్మాత బన్నివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని తెలుగులో ఇంత గర్వంగా రిలీజ్ చేయగలిగాను అంటే దానికి కారణం దినేష్ గారు. ఆయన మమ్మల్ని బలంగా నమ్మి ఇచ్చారు. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా హిట్ చేస్తారు. అదే నమ్మకంతో ఆయన సినిమా ఇచ్చారు. దినేష్ గారికి థాంక్యూ. మాడ్డాక్ ఫిల్మ్స్ టీం అందరికీ థాంక్ యు. సినిమాలో వినీత్ గారి క్యారెక్టర్ కి చాలా కనెక్ట్ అయ్యాను. క్లైమాక్స్ లో కన్నీళ్ళు వచ్చాయి. ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత ఈజీ కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ఇంత గొప్ప సినిమాగా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామంటే కారణం ఆ రోజు శంభాజీ మహారాజ్ లాంటి మహావీరులు త్యాగమే ఫలితమే. ఒక మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలనే తపనతో ఈ సినిమా చేశాం.
వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులకు సినిమాపై ఉన్న ప్రేమ చాలా ప్రత్యేకం. ఇక్కడ ప్రేక్షకులు సినిమాల్ని స్టార్స్ ని సపోర్ట్ చేస్తున్న విధానం అద్భుతం. ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేసిన గీత ఆర్ట్స్ కి, బన్నీవాస్ గారికి థాంక్ యూ. ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగు లో నాకు వాయిస్ ఇచ్చిన ఫణి వంశీ గారికి థాంక్. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూఅన్నారు.

మాడ్డాక్ CFO దివ్యాంశ్ గోయల్ మాట్లాడుతూ.. సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి థాంక్ యు, ఈసినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ మర్చిపోలేము’అన్నారు.
తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఒక బాధ్యతగా తీసుకున్నాము . మన చరిత్రని సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేయాలని ఒక రెస్పాన్స్ బుల్ గా ఈ సినిమా చేశాం. మనందరం ఇలాంటి సినిమాలు ఎంత బాగా ఆదరిస్తే ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. బన్నీవాస్ గారికి అందరికీ థాంక్యూ
తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎమోషన్ గా ఫీల్ అయ్యారు. నాలుగు రోజుల్లో డే అండ్ నైట్ కష్టపడి డబ్బింగ్ ని అద్భుతమైన క్వాలిటీతో పూర్తి చేశారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బన్నీ వాసు గారికి థాంక్యూ’అన్నారు.