Tuesday, December 24, 2024
HomeMovie Newsఓటీటీ సిరీస్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా

ఓటీటీ సిరీస్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా

- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఓ పక్క కొత్త హీరోయిన్ల హావ నడుస్తున్నప్పటికీ..తమన్నా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా కొత్త ఓటీటీ సిరీస్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రీతీ సిమోస్‌ నిర్మించనున్న ఓ కొత్త ఓటీటీ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ఈ సిరీస్‌లో తమన్నా న్యాయవాదిగా కనిపించబోతున్నట్లు టాక్​.

గతేడాది తమన్నా – ప్రీతి సిమోస్​ కాంబోలో ఆఖరి సచ్‌ అనే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ వచ్చి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడీ కొత్త ప్రాజెక్టును కరణ్‌ జోహార్‌తో కలిసి నిర్మించనున్నట్లు ప్రీతి తెలిపింది. దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ఓ కేసుతో ఈ ప్రాజెక్ట్​ను తెరకెక్కించనున్నట్లు తెలిపింది. కాగా, త్వరలోనే ఈ ప్రాజెక్టు చిత్రీకరణ మొదలుకానున్నట్లు సిరీస్‌ సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇకపోతే ప్రస్తుతం తమన్నా తెలుగు చిత్రం ఓదెల 2 షూటింగ్​తో బిజీగా ఉంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read