Monday, December 23, 2024
HomeMovie Newsషూటింగ్ లో గాయపడ్డ సూర్య

షూటింగ్ లో గాయపడ్డ సూర్య

- Advertisement -

తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ లోని కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను థాయిలాండ్‌లోని అడవిలో ఇటీవలే పూర్తి చేసిన చిత్ర బృందం తదుపరి షూటింగ్ ను చెన్నైలో జరుపుకుంటోంది.

ఈ క్రమంలోనే ఇటీవల సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. దీంతో సూర్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఆ వార్తలపై నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూర్యకు స్వల్పంగా గాయమైందని తెలిపారు. కానీ ఇప్పటికే సూర్య కోలుకున్నారని.. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల ఊటీలో ప్రారంభమైంది. అక్కడే ప్రమాదం జరగ్గా.. సూర్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read