Tuesday, May 7, 2024
HomeMovie Newsసుహాస్ చిత్రానికి బజ్ తీసుకొచ్చిన సుకుమార్

సుహాస్ చిత్రానికి బజ్ తీసుకొచ్చిన సుకుమార్

- Advertisement -

సుహాస్ ..ప్రస్తుతం టాలీవుడ్ తెగ వినిపిస్తున్న పేరు. సైడ్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇతడు..ఇప్పుడు హీరోగా వరుస సూపర్ హిట్లు కొడుతూ బిజీ హీరో అయ్యాడు. కలర్ ఫొటోతో హీరోగా మారిన ఆయన ప్రస్తుతం ప్రామిసింగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాను చేసే సినిమా కథలో వైవిధ్యం చూపిస్తూ ఆడియెన్స్‌ను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం ప్రసన్నవదనం మూవీ తో మే 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అర్జున్‌ వైకే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు దసపల్లా కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు టాప్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా వచ్చి సినిమాకు బజ్ తీసుకొచ్చారు.

సుహాస్​ నటించిన ప్రసన్నవదనం సినిమాను సలార్‌ ప్రాంఛైజీ బ్యానర్​ హోంబలే ఫిలిమ్స్‌ కర్ణాటక ప్రాంత పంపిణీ హక్కులను కొనుగోలు చేయడం మరో విశేషం. ఇక ఈ మూవీ లో పాయల్ రాధాకృష్ణ, నితిన్‌ ప్రసన్న, వైవా హర్ష, రాశీ సింగ్‌, సాయి శ్వేత, నందు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మణికంఠ, ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సుహాస్ చేతిలో అనందరావు అడ్వెంచర్స్, కేబుల్ రెడ్డి సినిమాలు ఉన్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read