Wednesday, December 25, 2024
HomeMovie Newsహీరో కిచ్చా సుదీప్ తల్లి కన్నుమూత

హీరో కిచ్చా సుదీప్ తల్లి కన్నుమూత

- Advertisement -

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆమె వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం 12 గంటలకు సరోజ పార్థివదేహాన్ని జేపీ నగర్‏లోని సుదీప్ నివాసానికి తీసుకొచ్చారు. తన తల్లి అనారోగ్యం కారణంగా, సుదీప్ నిన్న తెల్లవారుజామున బిగ్ బాస్ షూటింగ్ పూర్తి చేసాడు. సుదీప్ తల్లి సరోజ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

సుదీప్ తల్లి మంగళూరు. ఆమె మాతృభాష తుళు. ఆ భాష అంటే తనకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో సుదీప్ చెప్పుకొచ్చాడు. కానీ తనకు తుళు భాష అర్థమవుతుందని.. మాట్లాడలేనని అన్నారు. సుదీప్ తల్లి సరోజ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె ఇదివరకే తన కొడుకు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంది. సుదీప్ కన్నడ సినీరంగంలో అగ్ర హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఎస్ఎస్ రాజమౌళి, నాని కాంబోలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు సుదీప్.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read