Tuesday, December 24, 2024
HomeMovie Newsకార్తి 'సర్దార్‌ 2' సెట్‌లో ప్రమాదం.. స్టంట్‌మ్యాన్ మృతి

కార్తి ‘సర్దార్‌ 2’ సెట్‌లో ప్రమాదం.. స్టంట్‌మ్యాన్ మృతి

- Advertisement -

కోలీవుడ్‌ స్టార్​ కార్తి హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం సర్దార్‌ 2. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఈ మూవీ సెట్‌లో తాజాగా ప్రమాదం చోటు చేసుకొంది. ఫైట్‌ సీన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న స్టంట్​మ్యాన్‌ ఎజుమలై ప్రమాదవశాత్తూ 20 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. వెంటనే స్పందించిన మూవీటీమ్​ అతడిని హాస్పిటల్​కు తీసుకెళ్లింది. కానీ ఫలితం దక్కలేదు. అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయం అయిందని వైద్యులు తెలపారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడం వల్ల ఎజుమలై మృతి చెందాడని వైద్యులు నిర్థరించారని సమాచారం. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండేళ్ల కిందట రిలీజైన సర్దార్ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కార్తి డ్యూయల్ రోల్‌లో నటించాడు. తండ్రి, కొడుకుగా మంచి నటనను కనబరిచాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్‌ నటించారు. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడీయోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున రిలీజ్‌ చేశాడు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఫైనల్ రన్‌లో ఈ సినిమా ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సారి బడ్జెట్‌ కూడా పెరిగిందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ప్రమాదం జరగడంతో షూటింగ్ కు బ్రేక్ పడే అవకాశం ఉంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read