మూవీ మాక్స్ బ్యానర్ సమర్పణ లో మామిడాల శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో, విశ్వ దర్శకుడిగా, తెలుగు మరియు హిందీ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం “స్ట్రీట్ లైట్”. ఈ మూవీలో ప్రముఖ హిందీ నటి తాన్యా దేశాయ్ ప్రధాన పాత్ర పోషించగా మరో ఇంపార్టెంట్ రోల్ లో హీరో వినోద్ కుమార్ నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లిట్ అయినట్టు మేకర్స్ తెలిపారు.
ఈ సంధర్భంగా సినిమా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ…, కరోనా ప్రికాషన్స్ అన్ని తీసుకోని రాష్ట్ర ఆరోగ్య శాఖ నిబంధనలకు లోబడి, ఎంతో కష్టపడి ఒక భారీ స్ట్రీట్ లైట్ సెట్ వేసి, ఈ ప్యాండమిక్ టైమ్ లో కూడా కేవలం రెండు షెడ్యూల్స్ లలో 45 వర్కింగ్ రోజులలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేశాం అని తెలిపారు. అందుకు మాకు ఎంతగానో సహకరించిన మా యూనిట్ సభ్యులందరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ, ఇటువంటి క్లిష్ట పరిస్థుతులలో వారి సహాయ సాకారాలు మరువలేనిది అని తెలిపారు. అంతేకాక డాక్టర్ పరమహంస గారు మా చిత్ర నిర్మాణంలో, మరియు కథాగమనంలో తనవంతు సహాయ సహకారాలు అందించి, మాకు అన్ని రకాలుగా అండగా నిలిచి, ఈ చిత్ర విలువల్ని మరింత పెంచడం జరిగింది అని అన్నారు.
చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, చిత్ర నిర్మాణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించిన మా నిర్మాత మామిడాల శ్రీనివాస్ గారికి, డాక్టర్ పరమహంస గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ…, హ్యూమన్ బిహేవియర్ ఇన్ డార్క్ నెస్… చీకటి పడ్డ తర్వాత మనుషుల ప్రవర్తనలు ఎలా మారిపోతాయి అన్న కోణంలో, స్ట్రీట్ లైట్ క్రింద ఒక రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది, సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తి అయింది, చాలా నేచురల్ గా చూపిస్తూనే, ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ కి గుర్తిస్తూనే, కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ని కూడా జోడించాం మా స్ట్రీట్ లైట్ సినిమాలో అని డైరెక్టర్ విశ్వ తెలిపారు.
స్ట్రీట్ లైట్ లో నటీనటులు గా షకలక శంకర్, చిత్రం శ్రీను, ధనరాజ్, డాక్టర్ పరమహంస, అంకిత రాజ్, వైభవ్, కావ్య రెడ్డి, బాలాజీ నాగలింగం వంటి నటీనటులు నటించగా ఈ చిత్రానికి సంగీతం యు ఎల్ వి ప్రద్యోధన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రవి కుమార్ నీర్ల, మాటలు – పాటలు విష్ణుశర్మ, ఎడిటింగ్ శివ వై ప్రసాద్. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.