చిత్రసీమ భామలు స్టార్ క్రికెటర్స్ ను ఇష్టపడడం కామన్..ఆలా ఇష్టం కాస్త పెళ్లి వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పెళ్లైన క్రికెటర్ ను ఇష్టపడడం చాల రేర్. తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్..విరాట్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తుందట. కాకపోతే ఇదంతా ఇప్పుడు కాదు ఎప్పుడో అట. కొన్నేళ్ల కితం వరకు అయితే విరాట్ కోహ్లీ అంటే ఆమెకి పిచ్చి ప్రేమ అట. కోహ్లీ గేమ్ అయినా అతనన్నా చాలా ఇష్టం అని ఒకపుడు తనకి క్రికెట్ అంటే అసలు ఇష్టమే ఉండేది కాదు అని ఓ రోజు తన తమ్ముడు క్రికెట్ చూస్తున్న సమయంలో కోహ్లీ గేమ్ చూసి ఫ్యాన్ అయిపోయా అని అక్కడ నుంచి అతనంటే ఎంతో ఇష్టం ప్రేమ ఏర్పడిపోయాయి అని తెలిపింది.