Movie News

బాలీవుడ్ బాద్షా మూవీ లో సమంత..?

సమంత..ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే తో అందర్నీ మాయ చేసిన ఈ బ్యూటీ..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల పక్కన నటించి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ గా నిల్చింది. అదే సమయంలో అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకొని మరింత వార్తల్లో నిలిచింది. కానీ కొంతకాలానికే చైతూకు విడాకులు ఇవ్వడం..ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడం ఇలా చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదట పడడంతో మళ్లీ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ బాద్షా పక్కన జోడి కట్టే ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సౌత్ఇండియన్ టాప్ హీరోయిన్ సమంత- బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్​తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. స్టార్ డైరెక్టర్ రాక్​కుమార్ హీరాణీ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై దర్శకుడు రాజ్​కుమార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కేవలం పుకార్లేనని టీమ్​మెంబర్ ఒకరు తెలిపారు.

‘రాజ్​కుమార్ ప్రస్తుతం ఆయన నెక్ట్స్​ మూవీ స్ట్రిప్ట్​ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా ప్రారంభమే కాలేదు. షారుక్​తోగానీ, సమంతోగానీ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదు. ఇక రాజ్​కుమార్ ఇది దేశభక్తి, యాక్షన్ జానర్​లో తెరకెక్కనుందని వాస్తున్న వార్తలన్నీ రూమర్లే’ అని డైరెక్టర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా, షారుక్- రాజ్​కుమార్ కాంబోలో గతేడాది వచ్చిన ‘డంకీ’ హిట్​ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్​వైడ్​గా రూ.400+ కోట్ల వసూల్ చేసింది.