Thursday, April 24, 2025
HomeMovie News"సిర్రాకైంది సింగిల్ బతుకు" సాంగ్ రిలీజ్

“సిర్రాకైంది సింగిల్ బతుకు” సాంగ్ రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.  

- Advertisement -

ఈ చిత్రానికి  విశాల్ చంద్ర శేఖర్ సంగీత దర్శకుడు. ఫస్ట్ సింగిల్ ఒక సోల్ ఫుల్ రొమాంటిక్ మెలోడీ. సెకండ్ సింగిల్ గ్రూవ్ టు ది ఫ్రస్ట్రేషన్ యాంథమ్ సిర్రకైంది  సింగిల్ బతుకు కొద్దిసేపటి క్రితం విడుదలైంది.  “ఫ్రస్ట్రేషన్ యాంథెమ్”గా  ఈ పాట, ఒంటరి జీవితాన్ని ఒక వేడుకలా చూపిస్తుంది.

పాటలో సరదా సాహిత్యం, ఆకట్టుకునే మాస్ అప్పీల్ ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్ వోకల్స్, రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యంతో ఈ సాంగ్ అలరిస్తోంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి ఒంటరితనం ని హ్యుమర్ తో జోడిస్తూ చెప్పడం హిలేరియస్ గా వుంది.  

కేతికా శర్మ,  ఇవానా ఈ చిత్రంలో హీరోయిన్స్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ వేల్ రాజ్, ఎడిటింగ్ ప్రవీణ్ కెఎల్. ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గొర్రెపాటి.

#సింగిల్ మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read