Tuesday, December 24, 2024
HomeMovie Newsఐటెం సాంగ్ ఆఫర్ కు నో చెప్పిన ధమాకా బ్యూటీ..

ఐటెం సాంగ్ ఆఫర్ కు నో చెప్పిన ధమాకా బ్యూటీ..

- Advertisement -

ధమాకా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల..ఆ తర్వాత వరుసగా తెలుగు లో సినిమాలు చేస్తూ వచ్చింది. దాదాపు నెలకో సినిమా రిలీజ్ అవుతూ వచ్చింది. మహేష్ , నితిన్ , వైష్ణవ తేజ్ , బాలకృష్ణ ఇలా ఎంతోమందితో సినిమాలు చేసింది. కానీ వీటిలో ధమాకా , బాలకృష్ణ మూవీస్ తప్ప మారే చిత్రం హిట్ అనిపించుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు లో ఒక్క సినిమా లేకుండా అయిపోయింది. అందుకే తమిళ్ బాట పట్టింది. కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీకి మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటె తాజాగా ఈ భామకు విజయ్ మూవీ లో ఓ ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట.

త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దళపతి తన పెండింగ్​ మూవీ ప్రాజెక్ట్స్​ను పూర్తిచేసుకుని రాజకీయాలలోకి వస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో అయన నటించే చివరి రెండు సినిమాలపై ఫ్యాన్స్​ విపరీతమైన క్రేజ్ పెంచుకున్నారు. ఆ రెండు ఫిల్మ్స్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ ఒకటి. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీలకు ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. కానీ ఈ భామ దానికి నో చెప్పిందట. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ లో బిగ్ ఆఫర్లు వస్తున్నాయి..ఈ సమయంలో ఐటెం సాంగ్స్ చేస్తే కెరియర్ కు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి శ్రీ లీల నో చెప్పినట్లు తెలుస్తుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read