Tuesday, December 24, 2024
HomeMovie Newsకుమారి ఆంటీకి సోనూసూద్ భరోసా..

కుమారి ఆంటీకి సోనూసూద్ భరోసా..

- Advertisement -

కుమారి ఆంటీ.. హైదరాబాద్ లోనే కాదు సోషల్ మీడియా లో పరిచయం అక్కర్లేని పేరు. కేబుల్‌ బ్రిడ్జి దగ్గరలో రోడ్డు పక్కన చిన్న హోటల్‌ స్టాల్‌ను నిర్వహిస్తున్న ఆమె, సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్​ సంపాదించుకుంది. ఈమె హోటల్​ను సినీతారలు సందర్శిస్తూ ఆమెను మరింత పాపులర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె సీరియల్స్, టీవీ షోస్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని ఆమె ఫుడ్ స్టాల్ వద్ద స్వయంగా కలిసి అభినందించారు.

ఓ సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సోనూసూద్, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్​ను సందర్శించి ఆమె కుటుంబసభ్యులతో సరదాగా కాసేపు గడిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి పుడ్ స్టాల్​ను పెట్టుకొని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని ఆయన అభినందించారు. స్వయంగా ఆమెను సన్మానించి భోజనం వడ్డించారు. అయితే తాను 80 రూపాయల భోజన ప్రియున్ని అంటూ చమత్కరించిన సోనుసూద్, తన ఫతే చిత్రానికి సెలబ్రిటీ గెస్ట్​గా కుమారి అంటీని రావాలని ఆహ్వానించారు.

రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోనూసూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడకు త‌ర‌లివ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆమెతో సరదాగా మాట్లాడారు సోనూసూద్. పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్వించారు. మీ ద‌గ్గర ఎలాంటి వంట‌కాలు దొరుకుతాయ‌ని ఆమెను సోనూసూద్ అడిగారు. త‌న వ‌ద్ద అన్ని ర‌కాల వెజ్‌, నాన్‌వెజ్ ఫుడ్ దొరుకుంద‌ని కుమారి ఆంటీ చెప్పారు. అలాగే వెజ్ వెల రూ. 80 అని, నాన్‌వెజ్ రూ. 120 అని ఆమె తెలిపారు. దీనికి సోనూసూద్ తాను మాత్రం వెజ్ తింటాన‌ని అన్నారు.

త‌న‌కు ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా? అంటూ ఆమెను అడిగారు. దానికి కుమారి ఆంటీ మీకైతే ఫ్రీగా వ‌డ్డిస్తాన‌ని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో మందికి సాయం చేసిన మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత కుమారి ఆంటీకి సోనూసూద్‌ ఫుడ్ సైతం సర్వ్ చేశారు. అనంత‌రం ఆమెను శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు.

YOU ARE YOUR ONLY LIMIT..
Kumari aunty is a testament to the quiet strength and fierce resilience that resides in each woman..let us support, celebrate, uplift and empower these bearers of boundless strength by our words and actions ..#WomenEmpowerment pic.twitter.com/ETUR8jduGu— sonu sood (@SonuSood) July 5, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read