సోనాలి బింద్రే ..ఈ పేరు సినీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు లో మురారి , ఇంద్ర , ఖడ్గం , మన్మధుడు , పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా MBBS చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదే తరుణంలో పెళ్లి చేసుకొని సినిమాలను తగ్గించింది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమె గురించి నిత్యం మాట్లాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఈమె జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ది బ్రోకెన్ న్యూస్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సిరీస్ ప్రమోషన్స్‌లో తనపై జరిగిన ప్రచారం గురించి తెలిపి షాక్ ఇచ్చింది.
“నేను ఈ ఇండస్ట్రిలో 1994లో నా కెరీర్ మొదలుపెట్టాను. అప్పుడు ఇండస్ట్రిలో లైఫ్ వేరుగా ఉండేది. నాతో నటించిన చాలామంది యాక్టర్స్‌తో నాకు అఫైర్స్ ఉన్నాయని రూమర్స్ సృష్టించారు. అయితే అందులో ఏ ఒక్కటి నిజం కాదు. అప్పట్లో వాళ్ల మూవీ ప్రమోషన్స్ కోసం నిర్మాతలే హీరో హీరోయిన్స్ మధ్య ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి మీడియాకు చెప్పేవారు. మొదట్లో అలా ఎందుకు జరుగుతుందో అర్థం అయ్యేది కాదు. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. ఇప్పటికీ అలాంటి చెత్త ట్రెండ్ ఇండస్ట్రిలో కొనసాగుతుంది” అని సోనాలీ చెప్పుకొచ్చింది. అంతే కాదు నేను ఇండస్ట్రికి వచ్చే టైంకు హీరోయిన్స్ కొందరు బొద్దుగా ఉండేవారు. వాళ్లతో పోల్చుకుంటే నేను సన్నగా ఉండేదానిని. ఆ విషయం కొంతమంది ప్రొడ్యూసర్స్ నా ముఖం మీదే చెప్పేవారు. అయినా అవన్ని నేను పట్టించుకోలేదు. అసలు సినిమాల వైపు వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికోసం ప్రత్యేకంగా యాక్టింగ్‌లో, డ్యాన్స్ లో ట్రైనింగ్ తీసుకోలేదు. ఇండస్ట్రీకి వచ్చాకే అన్ని నేర్చుకున్నాను అయితే టాప్ హీరోలతో పనిచేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను చేసిన పాత్రల వల్ల నా కెరీర్లో స్టార్ హీరోయిన్గా మారాను” అంటూ తెలిపింది.