బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లయిన పది రోజులకే తాను ప్రెగ్రెంట్ అంటూ వస్తున్న వార్తలపై ఫన్నీగా స్పందించింది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గత నెలలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె గర్భవతి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. తాను గర్భవతి అనే ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
తాజాగా కాకుడ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సోనాక్షి తన పెళ్లి తర్వాత జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నానని సోనాక్షి సిన్హా తెలిపింది. జీవితం ఇంతకంటే అందంగా, గొప్పగా ఉండదేమో అనిపిస్తోందన్నారు. ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని పేర్కొంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు లేదని చెప్పింది. పెళ్లి తర్వాత మళ్లీ తన సినిమాల చిత్రీకరణ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక మార్పు ఏంటంటే.. ఇకపై మేం హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకోవడం లేదని సోనాక్షి సిన్హా తెలిపింది. ఎందుకంటే మేం అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారని.. ఇదొక్కటే ఆలోచనలో ఉంటున్నారని తెలిపింది.