Movie News

సంక్రాంతికి వస్తున్నాం: మీనాక్షి చౌదరి స్పెషల్ ఇంటర్వ్యూ

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో రూపొందిన హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “సంక్రాంతికి వస్తున్నాం” జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. మీనాక్షి మాట్లాడుతూ, “సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నా డ్రీమ్ రోల్ చేశాను.ఇందులో ఫస్ట్ టైమ్ కామెడీ జోనర్ ట్రై చేయడం, కాప్ రోల్ ప్లే చేయడం ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు.వెంకటేష్ గారితో పని చేయడం వండర్‌ఫుల్ అనుభవం ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ అద్భుతం. సెట్‌లో మంచి వాతావరణం ఉండేది,” అని మీనాక్షి అన్నారు.ఐశ్వర్య రాజేష్ గారు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆమెతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నారు.

గోదారి గట్టు పాట సెన్సేషనల్ హిట్. బీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది అన్నారు.అనిల్ గారి కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్. ప్రతి సీన్ డిటైల్‌గా ఎక్స్‌ప్లైన్ చేసి నన్ను ప్రోత్సహించారు. ఆయనతో పని చేయడం చాలా ప్రత్యేకంగా అనిపించింది అన్నారు.

దిల్ రాజు గారి నిర్మాణంలో పని చేయడం గ్రేట్ అనుభవం. మళ్లీ వారి బ్యానర్‌లో చేయాలని ఉంది,” అన్నారు.బాలయ్య గారితో అన్‌స్టాపబుల్ ఎపిసోడ్”బాలయ్య గారు ఓజీ. ఆయన ఎనర్జీ అసాధారణం,” అన్నారు మీనాక్షి.

కొత్త ప్రాజెక్టులు”నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తుండగా, మరో రెండు సినిమాలు త్వరలో అనౌన్స్ అవుతాయి,” అన్నారు.”సంక్రాంతికి వస్తున్నాం” ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే క్లీన్ ఎంటర్‌టైనర్ అని మీనాక్షి స్పష్టం చేశారు.