తెలుగు వార్తలు

అన్నయ్య కోసం సీతారాముడు

“ఒక్క ప్రాణం కాస్త న‌ల‌త‌గా ఉండి ఆయాస‌ప‌డుతోంటే… ఒక‌టి కాదు, వేలూ ల‌క్ష‌లు కాదు, కోట్లాది ప్రాణాలు క‌ల‌త‌ పడి కొట్టిమిట్టాడుతున్నాయి

ఒక్క శ్వాస‌లో స‌రిగ‌మ‌లు అప‌శ్రుతిని స‌రిచేసుకుంటుంటే నా దేశ‌పు ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతోంది

కొన్ని త‌రాలుగా గాలి, బాలు పాట‌గా, మాట‌గా మారి ఉనికిని చాటుకుంటూ వీస్తోంది… విహ‌రిస్తోంది ఇప్పుడెందుకో ఓ చిన్న వెంటిలేట‌ర్ ఇరుకుల్లో చిక్కుకుని విల‌విలలాడుతోంది
కొన్నాళ్లుగా ఆకాశ‌పు మౌనం కంటికి మింటికి ఏక ధార‌గా రోధించి నిన్న‌టి నుంచే వెచ్చ‌ని సూర్య కిర‌ణాల‌తో చెక్కిళ్లు తుడుచుకుని కాస్త తెరిపిన ప‌డుతోంది

అన్న‌య్యా… ఇక చాలు
ఇన్నిరోజులుగా మౌనంగా విశ్రాంతి తీసుకునే హ‌క్కూ.. అక్క‌ర నీకు లేవు తొంద‌ర‌గా కోలుకో
కొత్త ప‌ల్ల‌వితో ప‌కృతిని ప్రాణ‌గీతిక‌గా చిగురించ‌ని మా అంద‌రి గొంతులో కొట్టుకుంటున్న గుండెల స‌డిని స‌రిచేయి

చినుకు చెమ్మ‌లో మ‌స‌క‌బారిపోయిన దిశ‌ల‌కు నీ న‌వ్వుల వెలుగుతో దారి చూపాలి రా..
ఇది నా ప్రార్థ‌న‌

శివుడి ఆన కాలేదు నిన్ను చీమైనా కుట్ట‌దు ఆ శివుని మీద ఆన‌
నీ త‌మ్ముడు
– సీతారాముడు