స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి రూమర్స్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పిన శ్రుతి, ఈసారి తన మాటలకు మరింత స్పష్టతనిచ్చారు. “లైఫ్ అనేది మార్పులతో నిండినదే. గతంలో నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. కానీ, ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు. సరైన వ్యక్తి లభిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం” అని ఆమె అన్నారు. తాను రిలేషన్‌షిప్‌లో ఉండటానికి ఇష్టపడతానని, కానీ ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని శ్రుతి స్పష్టం చేశారు. “నేను రొమాంటిక్‌గా ఉండటం ఇష్టపడతాను. కానీ, ప్రస్తుతానికి నా పనిపైనే దృష్టి పెట్టాను. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే, పెళ్లిపై ఆలోచిస్తాను” అని తెలిపారు.
తాజాగా ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో “మీరు సింగిలా? రిలేషన్‌లో ఉన్నారా?” అని అడిగిన ప్రశ్నకు శ్రుతి ఘాటుగా స్పందించారు. “ఇటువంటి ప్రశ్నలు నాకు నచ్చవు. అయితే చెబుతున్నాను, ప్రస్తుతం నేను సింగిలే. రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేస్తూ నా వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను” అని అన్నారు. ప్రస్తుతం శ్రుతి పెద్ద ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సీక్వెల్ సలార్ శౌర్యాంగపర్వంలోనూ ఆమె నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆమె అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి.
అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డకాయిట్ సినిమాలో మొదట శ్రుతిని ఎంపిక చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.