టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన ప్రభాస్ మాంచి భోజనప్రియుడన్న సంగతి తెలిసిందే. అతిథులకు అదిరిపోయే రుచులతో విందుభోజనాలు ఏర్పాటు చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా..అందుకే ప్రభాస్ తో సినిమా అంటే పెద్ద నటి నటుల దగ్గరి నుండి చిన్న నటుల వరకు అంత ఉత్సాహం చూపిస్తారు. కొంతమంది అయితే ఈ భోజనం కోసం అయినా ప్రభాస్ తో సినిమా చేయాలనీ అనుకుంటారు. ఈ లిస్ట్ లో శ్రద్ద కపూర్ చేరింది.
సాహోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ శ్రద్ధాకపూర్. ఈ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు దగ్గర కావాలని అనుకుంది. కానీ ఈ మూవీ అంతగా ఆడలేదు. అయినప్పటికీ వీరిద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. అయితే శ్రద్ధాకు మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదు. ఈక్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ శ్రద్ధా కపూర్‌ను మళ్లీ ప్రభాస్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడిగాడు. దీనికి శ్రద్ధా ఫన్నీగా స్పందించింది. ప్రభాస్ మళ్లీ తన ఇంటి నుంచి ఎప్పుడు భోజనం పంపిస్తే అప్పుడు నటిస్తాను అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు శ్రద్దా కపూర్ ఫుడీలా ఉందే? అంటూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, హను రాఘవపూడి చిత్రాల్లో నటిస్తున్నారు. శ్రద్ద బాలీవుడ్ చిత్రాల్లో బిజీ గా ఉంది.