Movie News

బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధం అవుతున్న మహేష్ ..నాగ్

గత కొద్దీ రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. అగ్ర హీరోల దగ్గరి ఉన్న చిన్న హీరోల వరకు నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. చిరంజీవి , నాగార్జున , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , బాలకృష్ణ, రామ్ చరణ్, రవితేజ ఇలా ఎంతో మంది
నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి నాగార్జున , మహేష్ బాబు లు సందడి చేసేదుకు సిద్ధమయ్యారు.

అక్కినేని నాగార్జున తన కెరీర్ ను మలుపు తిప్పిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా “శివ”. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ అప్పట్లో ఓక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇన్నాళ్లకు శివ రీరిలీజ్ కానుందని సమాచారం. ఆగస్ట్ 29 కింగ్ నాగ్ బర్త్ డే కానుకగా అయితే రీ రిలీజ్ చేసేందుకు అక్కినేని అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తుంది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు9న మురారి, ఒక్కడు చిత్రాలను రిలీజ్ చేయబోతున్నారు నిర్వాహకులు. ఘట్టమనేని వారి వివాహానికి రావాలంటూ మురారి చిత్ర రీరిలీజ్ సరికొత్త ప్రమోషన్స్ కు తెరలేపారు ఘట్టమనేని ఫ్యాన్స్. తమ కకెరీర్ లను మలుపు తిప్పిన శివ, మురారి రీ రిలీజ్ లు ఏ మేరకు కలెక్షన్లు రాబడతాయో చూడాలి.