Tuesday, December 24, 2024
HomeMovie News'రేస్ రాజా' గా వస్తున్న శర్వా..

‘రేస్ రాజా’ గా వస్తున్న శర్వా..

- Advertisement -

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం తనకు కలిసొచ్చే బ్యానర్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

‘శర్వా 36’గా తెరకెక్కనున్నఈ సినిమాకు మేకర్స్ ఓ క్రేజీ టైటిల్​ను ఫిక్స్ చేశారట. ఇందులో భాగంగా ‘రేస్ రాజా’ అనే పేరును పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని, అందుకే ఈ టైటిల్​ను ఖరారు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్​పై ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ లాంటి సూపర్ హిట్​ సినిమాల్లో నటించారు శర్వా. దీంతో ఇప్పుడు ఇప్పుడు ఈ మూవీ ఫై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా శర్వా కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read