చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ #Sharwa36 లో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం లో ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. త్వరలోనే టైటిల్ ను లాంచ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ సినిమాలో అతని లుక్ ను రివిల్ చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. టోర్న్ జీన్స్, స్టైలిష్ స్పోర్ట్స్ జాకెట్, షేడ్స్ ధరించి యమహా RX-100 బైక్ పై కూర్చున్న శర్వా లుక్ అదిరిపోయింది. శర్వా కూల్ అండ్ ఎనర్జిటిక్ వైబ్ తో కనిపించిన ఈ లుక్ ఛరిస్మాటిక్ గా వుంది.
వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే శర్వా, ఈ చిత్రంలో మరో సవాలుతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈసారి, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆడ్రినలిన్ రష్‌ని ఇచ్చే స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారు.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ హై-ఎనర్జీ చిత్రం మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది, మూడు తరాల నేపధ్యంలో ఒక కుటుంబం, ప్రేమ, కలలతో ముడిపడి 90s, 2000s ప్రారంభంలోని ఎక్సయిటింగ్ మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న అద్భుతమైన కథ.
ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్ ని అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.