Movie News

శంకర్ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

డైరెక్టర్ శంకర్ ఫై గత కొద్దీ రోజులుగా మెగా ఫ్యాన్స్ ఆగ్రహం తో ఊగిపోతున్నారు. శంకర్ – రామ్ చరణ్ కాంబోలో రాబోయే గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ప్రాజెక్టు మొదలయి మూడేళ్లు అవుతున్నా సినిమా రిలీజ్ కాదు కదా కనీసం ఒక్క అప్డేట్ కూడా లేదు. ఇప్పటివరకు ఒక పోస్టర్, సాంగ్ తప్ప గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇంకే కంటెంట్ రాలేదు. ఈ క్రమంలో తాజాగా శంకర్ సినిమా తాలూకా బిగ్ అప్డేట్ ఇచ్చి అభిమానుల ఆగ్రహాన్ని కాస్త చల్లారించాడు.

‘‘నేను తీసిన తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే డైరెక్ట్​గా తెలుగులోనూ ఓ చిత్రం చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ కొన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరనుంది. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో దీన్ని చేస్తున్నాను. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ మూవీ. టాలీవుడ్‌లో ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది’’ అని పేర్కొన్నారు. ఇది విన్న ఆడియెన్స్​ ఫుల్​ ఖుషి అవుతున్నారు. కాగా, సినిమాలో రామ్​చరణ్‌ డబుల్ రోల్​ చేశారని సమాచారం. కియారా అడ్వాణి హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. హీరో పాత్రకు సంబంధించి ఇటీవల షూటింగ్ పూర్తైంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయ నాయకుడిగా, ప్రస్తుతం IAS ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ IAS ఆఫీసర్ గా చేసే పాత్ర పేరు వైరల్ గా మారింది. ఇందులో చరణ్ పాత్ర పేరు ‘రామ్ నందన్’ అని సమాచారం. ఈ విషయం తెలిసి IAS ఆఫీసర్ పాత్రకి బాగానే సూట్ అయింది, పేరు క్లాస్ గానే ఉంది అని అంటున్నారు అభిమానులు. మరి ఫ్లాష్ బ్యాక్ లో ఉండే పొలిటికల్ లీడర్ కి ఏం పేరు పెట్టారో అని ఆలోచిస్తున్నారు.