Movie News

రవితేజ కోసం సూపర్ సెట్ ను సిద్ధం చేసిన డైరెక్టర్

మాస్ మహారాజ రవితేజ సినిమాలపై ఎంత ఇంట్రస్ట్ చూపిస్తాడో తెలియంది కాదు..హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటాడు. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. హిందీ రైడ్ సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్‌గా హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే తన 75 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను బోగవరపు దర్శకుడిగా పరిచయం చేస్తూ….కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక రైల్వే స్టేషన్ సెట్ ను వేసినట్లు సమాచారం వినిపిస్తుంది. రవితేజ లేకుండా ఉండే సీన్స్ ను కొన్ని ఆల్రెడీ షూట్ చేసేసారట. ఇకపోతే ప్రస్తుతం రవితేజ హరిష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తవుగానే ఈ సినిమా సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు రవితేజ.