Movie News

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7న రీరిలీజ్ చేస్తున్నాం – దిల్ రాజు

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7 శుక్రవారం రీరిలీజ్ చేస్తున్నాం. అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి’ అన్నారు నిర్మాత దిల్ రాజు.
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని మార్చి 7న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  

ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సంక్రాంతి వస్తున్నాం తర్వాత ప్రేక్షకులని కలవడం ఆనందంగా వుంది. మార్చి7 శుక్రవారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ చేస్తున్నాం. తొలిప్రేమ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఐదేళ్ళు సినిమా రైట్స్ మా వద్ద ఉండేవి. మాకు ఎప్పుడు డబ్బులు తక్కువ వున్నా సినిమాని రీరిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేవి. అవన్నీ మిరాకిల్స్ డేస్. అలాగే ఇప్పుడు కూడా రీరిలీజ్ పెడితే ఆడియన్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ కి సంబధించి అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్రెడీ ఓటీటీ లో వుంది. జనం చుసేశారు. అయినప్పటికీ మళ్ళీ థియేటర్స్ కి వస్తున్నారంటే.. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు థియేటర్ కి వచ్చి మళ్ళీ  బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని మళ్ళీఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి. ఆంద్రలో డే వన్ అరవై డెబ్బై శాతం అడ్వాన్స్ బుకింగ్స్ వున్నాయి. ఫ్రైడేకి అవి ఫుల్స్ అయిపోతాయి. సుదర్శన్ 35ఎంఎం సెకండ్ డే కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి. రీరిలీజ్ హ్యాపీనెస్ ఈ సినిమా ద్వారా కనిపిస్తోంది. నేనూ వెళ్లి మార్చి 7న సుదర్శన్ 35ఎంఎం లో మార్నింగ్ ఎనిమిది గంట షో చూస్తాను. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి.. థాంక్ యూ’అన్నారు

ఈ సందర్భంగా విలేకరుల అడిగిన ప్రశ్నలకు నిర్మాత దిల్ రాజు సమాధానాలు ఇచ్చారు.

దిల్ రాజు గారు.. 12 ఏళ్ల క్రితం ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు ?
-రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకూ అందరు హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేస్తూ వచ్చారు. తర్వాత ఎందుకుకో మారుతూ వచ్చింది. ఒకరోజు డైరెక్టర్ శ్రీకాంత్ ఈ ఐడియా చెప్పారు. మొదట వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అయ్యాం. ఇద్దరూ కథ విని ఓకే అన్నారు. మేము అనుకున్న కథని స్క్రీన్ పై తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. దాదాపు వన్ ఇయర్ షూట్ చేశాం.

-మహేష్ గారు వెంకటేష్ గారు ఈ సినిమా కోసం చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హోమ్ వర్క్ చేసుకున్నారు. అందుకే సినిమా నేచురల్ గా కనిపిస్తుంది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా అంత అద్భుతంగా వచ్చింది కాబట్టే ఈ రోజు రీరిలీజ్ కి కూడా ఇంత వాల్యూ.

సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచన లేదా?
-ఈ సినిమా సీక్వెల్ ఎలా చేయొచ్చు ? అనే మంచి ఐడియా ఎవరు చెప్పినా నేను రెడీ. రీరిలీజ్ రోజు మళ్ళీ చూడండి. మంచి ఐడియాతో రండి(నవ్వుతూ).

రీరిలీజ్ బజ్ ఎలా వుంది ?
-అప్పుడే పది థియేటర్స్ ఫుల్ అయ్యాయి. ఫ్యాన్స్ తో పాటు ప్యామిలీ ఆడియన్స్ టికెట్స్ అడుగుతున్నారు. ఓవర్సీస్ లో కూడా యాభై శాతం బుకింగ్స్ అయ్యాయి. రన్నింగ్ లో ఫుల్ అవుతాయి. బిగ్ స్క్రీన్ లో చూస్తే ఆ మ్యాజిక్ వేరుగా వుంటుంది. మంచి సినిమాని మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఇంట్రస్ట్ అందరికీ వుంది.

-ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదని భయపడాల్సిన అవసరం లేదు. మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అక్కడా రికార్డ్ స్థాయిలో వాచ్ టైం వస్తోంది. ఆడియన్స్ చాలా క్లారిటీ గా వున్నారు. మంచి సినిమానే చూస్తున్నారు.

రీరిలీజ్ లో ఎంత కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ?
-రీరిలీజ్ కి ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారనే ఆనందం తప్పితే మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఒక నిర్మాతగా 12 ఏళ్ల తర్వాత సినిమా రీరిలీజ్ లో హౌస్ ఫుల్ థియేటర్ చూసినప్పుడు ఆ కిక్కే వేరు. ఇదే మాకు ముఖ్యం.

రీరిలీజ్ లో కొత్త పుటేజ్ యాడ్ చేస్తున్నారా ?
-చాలా పుటేజ్ వుంది కానీ ఏమీ యాడ్ చేయడం లేదు.(నవ్వుతూ). అప్పుడు ఏది రిలీజ్ చేశామో అదే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం.

మీ బ్యానర్ లో కొత్త సినిమాల గురించి ?
విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ.. ఈ రెండు సినిమాలు మే లోపు టేకాప్ అవుతాయి.