Monday, December 23, 2024
HomeMovie Newsఓటిటి లో కుమ్మేస్తున్న సత్యవతి

ఓటిటి లో కుమ్మేస్తున్న సత్యవతి

- Advertisement -

కాజల్​ సెకండ్​ ఇన్నింగ్స్​లో రాణించేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్​గా ఆమె నటించిన సత్యభామ చిత్రం థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించింది. అనంతరం అమెజాన్ ప్రైమ్​ ఓటీటీలో విడుదలైంది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు అనూహ్యంగా భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటి వరకూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్​తో ట్రెండ్​లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని సదరు ప్లాట్​ఫామ్​ కూడా అఫీషియల్​గా ప్రకటించింది. కాగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించారు. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించారు. సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్​ ఆఫీసర్​గా నటించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ప్రస్తుతం కాజల్ ఉమ, కన్నప్ప, ఇండియన్ 3 చిత్రాల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్​ కానున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read