News

ప్రభాస్ హోమ్ బ్యాన‌ర్ లో మరోసారి నటించబోతున్న యంగ్ హీరో

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారాడు సంతోష్ శోభ‌న్. చిన్న చిన్న నిర్మాణ సంస్థల్లో కాదు పెద్ద పెద్ద బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేసేస్తుంటాడు. ప్రభాస్ హోమ్ బ్యాన‌ర్ అయిన యూవీ క్రియేష‌న్ లో సంతోష్ విరివిగా సినిమాలు చేస్తున్నాడు. ‘ఏక్ మినీ క‌థ‌’ ఆ సంస్థ‌లో చేసిన సినిమానే. ఈ సినిమా ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకొంది.

ఆ త‌ర‌వాత ‘క‌ల్యాణం క‌మ‌నీయం’ కూడా అదే సంస్థ‌లో చేశాడు. ఇప్పుడు సంస్థ‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా ఒప్పుకొన్నాడు. రేపు సంతోష్ శోభ‌న్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా యూవీ క్రియేష‌న్స్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌బోతోంది. అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు, ఈ సినిమాలో మిస్ ఇండియ మాన‌స వార‌ణాసి క‌థానాయిక‌గా న‌టిస్తోంది.