వెంకటేష్ గారు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
వండర్ ఫుల్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతికి హానెస్ట్ గా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఆడియన్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. చాలా సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. హిట్ కాదు.. ట్రిపుల్ బ్లాక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ.
వెంకటేష్ గారు.. అనిల్ గారు ఈ సినిమాకి ప్రమోషన్స్ ఐడియా చెప్పినప్పుడు ఎలా అనిపించింది ?
ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ వుండేది. ఈ సినిమా జర్నీ ఒక మ్యాజికల్ గా అనిపించింది. అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇదంతా డివైన్ ఎనర్జీగా భావిస్తున్నాను.
అనిల్ గారు..’సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఎలా అనిపించింది ?
ఇంతమంది చూసి అప్రిషియేట్ చేయడం, రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించనదాని కంటే అద్భుతంగా రావడం చాలా ఆనందంగా వుంది. వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో రావడం చాలా హ్యాపీగా వుంది.
అనిల్ గారు ఈ సినిమా విజయంలో భీమ్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది.. నెక్స్ట్ ఆయనతో జర్నీ ఎలా వుంటుంది ?
భీమ్స్ లో నాకు నచ్చే క్యాలిటీ దర్శకుడి కావాల్సిన మ్యూజిక్ ఇవ్వడం. ఈ పొంగల్ తో భీమ్స్ టైం మొదలైయింది. నెక్స్ట్ పదేళ్ళు తనదే. తనతో నా జర్నీ వుంటుంది.
వెంకటేష్ గారు..ఈ జర్నీలో అనిల్ గారిలో ఎలాంటి మార్పులు గమనించారు ?
నేను తొలిసారి కలిసినప్పుడు అనిల్ ఓ రైటర్. తనలో అప్పుడే ఒక స్పార్క్ కనిపించింది. మా మధ్య మంచి రేపో వుంది. తనతో ఎప్పుడూ ఓ ఫ్రెండ్ లానే వుంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం, అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్ గా వుంటుంది. తను చాలా ఎనర్జిటిక్ గా వుంటారు.
భీమ్స్ గారు.. అనిల్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
అనిల్ గారు ఓ లైబ్రెరీ. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా చిన్న చిన్న పదాలని ఎంత అందంగా పట్టుకోవచ్చో తెలుసుకున్నాను.
వెంకటేష్ గారు.. 230 కోట్లు పోస్టర్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేసివుంటే నెంబర్ ఇంకా బిగ్ గా వుండేది కదా ?
నేను ఎప్పుడూ ఏదీ అడగను. వచ్చింది తీసుకోవాలి. నిజానికి ఇది చాలా బోనస్. ఒక మంచి సినిమా హిట్ సినిమా ఇవ్వాలనుకున్నాం, ఆడియన్స్ సపోర్ట్ తో అది నెక్స్ట్ లెవల్ బ్లాక్ బస్టర్ కి వెళ్ళింది. ఇంతకంటే ఏం కావాలి.
భీమ్స్ గారు.. మీరు ప్రమోషన్స్ కి దూరంగా ఉండటానికి కారణం ?
నా పాటే నా పబ్లిసిటీ.