Movie News

‘డబుల్ ఇస్మార్ట్’ పూర్తి చేసిన సంజయ్

రామ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. పూరి డైరెక్షన్లో నాభ నటేష్ , నిధి అగర్వాల్ జంటగా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.ఈ చిత్రానికి రామ్ యాక్టింగ్ , పూరి డైరెక్షన్ , మణిశర్మ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విజయం తర్వాత వెంటనే పార్ట్ 2 తెరకెక్కిస్తారని అనుకున్నారు కానీ కుదరలేదు. ఈ మూవీ తర్వాత రామ్ చేసిన సినిమాలన్నీ ప్లాప్స్ అయ్యాయి. ఈ తరుణంలో కొద్దీ నెలల క్రితం ఇస్మార్ట్ 2 అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఈ క్రమంలో తాజాగా తన పాత్రకు సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తి చేసి.. ఈ సినిమాకు తన పాత్రను పూర్తి చేశారు. ఇక ప్రమోషన్స్‌కు ఆయన వస్తారా? రారా? అనేది తెలియాల్సి ఉంది. సంజూ భాయ్ తన వాయిస్‌ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. సంజయ్ దత్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావస్తుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో రెండు పాటలు, టీజర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుంది.