మయోసైటటిస్ కోసం తీసుకున్న బ్రేక్ తర్వాత సమంత ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇదే క్రమంలో కొత్తగా మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ, గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి విలువిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది.
ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నా. తెలియని విషయాల్ని తెలుసుకుంటున్నా. నన్ను నేను నిర్వచించుకోవల్సి వస్తే .మొదట నేను ఒక విద్యార్థిని అనే అంటాను. ఎన్ని సినిమాలు చేసినా, చేయబోయే పాత్రలు మనకెంతో నేర్పిస్తాయి. ప్రతి స్ర్కిప్ట్తో విభిన్న పాత్రలోకి, వింత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తాయి’’ అని సామ్ తెలిపింది. ‘సినిమా ఇండస్ట్రీలో ఇన్నేళ్లగా ఉన్నా ప్రతి రోజు, ప్రతి పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఈ రంగంలో చేయాల్సింది, తెలుసుకోవల్సింది చాలా ఉందని నా భావన. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది’’ అని అంటోంది సమంత.