Movie News

సమంత కు వస్తున్న కష్టాలు ఎవ్వరికి రావొద్దు

పాపం సమంత కు అన్ని విషాద ఘటనలే ఎదురవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆమెను కోలుకోకుండా చేస్తుంది. తాజాగా ఈరోజు ఆమె తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలియజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు అభిమానుల, సెలబ్రిటీలు సానుభూతిని తెలియజేస్తూ.. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు సమంత జన్మించారు. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు ఆమె చెప్పుకొచ్చింది. తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని తెలిపింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ.. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.

చిన్నతనంలో నేను గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తుండేదాన్ని. నాకు ఏమీ తెలియని అమాయకురాలినని నా తండ్రి భావించేవారు. నన్ను ఒక చిన్నపిల్లలా చూసేవారు. మా నాన్న ఒక్కరే కాదు. భారత్​లో ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లలను అలాగే చూస్తారు. ఆయన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను చేయలేననుకున్నా. సినిమా రీలీజ్ అయ్యాక వచ్చిన ప్రశంసలను కూడా అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. కాన్ఫిడెన్స్​ పెంచుకున్నాను. నటిగా రాణించిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో గర్వపడ్డారు. నా పని విషయంలో వాళ్లు సంతృప్తి చెందారు’ అని సమంత తన తండ్రి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.