Monday, December 23, 2024
HomeMovie Newsహాఫ్ న్యూడ్​ ఫొటో ఫై సామ్ క్లారిటీ

హాఫ్ న్యూడ్​ ఫొటో ఫై సామ్ క్లారిటీ

- Advertisement -

సోషల్ మీడియా లో ఇటీవల ఫేక్ ఫొటోస్, వీడియోస్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. రష్మిక, కాజోల్ , అనుష్క శర్మ తదితరుల ఫొటోస్ , వీడియోస్ వైరల్ గా మారాయి. వీటిఫై పెద్ద ఎత్తున కామెంట్స్ సైతం వచ్చాయి. తాజాగా సమంత కు సంబదించిన ఓ పిక్ ను కూడా ఇలాగే వైరల్ చేయడం తో ఆమె స్పందించింది.

మొదటి నుండి కూడా సమంత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. తన సినిమాల తాలూకా విశేషాలు , పర్సనల్ ముచ్చట్లు , హెల్త్ అప్డేట్స్ ఇలా అన్ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను , ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఓ ఫోటో అంటూ ఒక ఫోటో మీద రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సామ్ తాను మయోసైటీస్ బారిన పడినట్లు కొన్నాళ్ల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయమై సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు కూడా చెప్పింది. ఇప్పుడు కూడా మయోసైటీస్​కు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పి ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసి ” ట్రీట్మెంట్ తీసుకుంటూనే కోలుకోవడానికి మార్గాలు వెతుకుతున్నా” అని క్యాప్షన్ పెట్టింది.

ఈ ఫొటోతో పాటు మరో ఫోటో కూడా సమంత షేర్ చేసి తర్వాత డిలీట్ చేయడం తో అంత రకరకాలుగా మాట్లాడుకుంటూ ఓ ఫోటో ను వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మళ్లీ సమంత తన ఇన్​స్టా స్టోరీలో ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. “మిమ్మల్ని మీరు సమర్ధించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా బ్రతకడమే నిజమైన విజయం” అనే కొటేషన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్​తో సమంత హాఫ్​ న్యూడ్ ఫొటో ప్రచారానికి ఎలాంటి వివరణ ఇవ్వకుండా కొటేషన్​తో సమాధానం చెప్పిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read