Movie News

మెగాస్టార్ మూవీలో సమంత..?

సమంత..ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే తో అందర్నీ మాయ చేసిన ఈ బ్యూటీ..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల పక్కన నటించి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ గా నిల్చింది. అదే సమయంలో అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకొని మరింత వార్తల్లో నిలిచింది. కానీ కొంతకాలానికే చైతూకు విడాకులు ఇవ్వడం..ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడం ఇలా చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదట పడడంతో మళ్లీ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ఆమెకు మెగాస్టార్ పక్కన జోడి కట్టే ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. వివిధ జోనర్‌లలో వరుసగా సూపర్ హిట్‌లు కొడుతున్నారు. ఇక రీసెంట్‌గా తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో మమ్ముట్టి ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా బజ్ ప్రకారం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ సమంత ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గౌతమ్ మీనన్‌తో హ్యాట్రిక్ సినిమా అవ్వనుంది. ఇంతకుముందు గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో ‘ఏమాయ చేశావే’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రాల్లో సామ్ యాక్ట్ చేసింది. ఇందులో ఏమాయ చేశావే సమంత డెబ్యూ మూవీ కావడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 15న చెన్నైలో ప్రారంభం కానుంది. జూన్ 20న మమ్ముట్టి సెట్స్‌లో జాయిన్ అవుతారు. గతంలో మమ్ముట్టి- సమంత కలిసి ఓ యాడ్‌లో నటించారు. మమ్ముట్టి ప్రొడక్షన్ బ్యానర్‌ అయిన ‘మమ్ముట్టి కంపెనీ’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

మెగాస్టార్ మమ్ముట్టి రీసెంట్​గా టర్బోతో మంచి విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు ‘భ్రమయుగం’ చిత్రంతోనూ బ్లాక్ బస్టర్ హిట్​ను ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుసగా సూపర్ హిట్స్ సాధిస్తూ హిట్ ట్రాక్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ‘కడుగన్నావా ఒరు యాత్ర’, ‘బజూకా’ చిత్రాలలోనూ నటిస్తున్నారు. మరోవైపు సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే బాలీవుడ్​ సిరీస్ చేసింది. వరుణ్ ధావన్ లీడింగ్ రోల్‌లో పోషించిన ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందులో సామ్ యాక్షన్ అదరగొట్టేసిందని మూవీటీమ్ చెబుతోంది.