Movie News

‘సలార్ 2’ అటకెక్కినట్టేనా..?

సలార్ 2 షూటింగ్ ఆగిపోయిందా..? ఇప్పట్లో సలార్ మూవీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదా..? ప్రస్తుతం ఇవే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’ గతేడాది రీలీజై భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మునుపెన్నడు లేని విధంగా ప్రభాస్​ను మాస్​ లుక్​లో చూపించడం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దీని సీక్వెల్ ‘శౌర్యంగ పర్వం’లో ప్రభాస్ యాక్షన్ సీన్స్​, వైలెన్స్ ఎక్కువగా ఉంటాయని మేకర్స్ తెలిపిన నేపథ్యంలో ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. దీంతో సలార్ పార్ట్- 2 (శౌర్యంగ పర్వం) ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్​ ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ ను ఆపేశారని ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సలార్ 2 విషయంలో ప్రభాస్, నీల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అటకెక్కించారనే రూమర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తాత్కాలికంగా సలార్- 2ను పక్కనబెట్టి, ‘రాజాసాబ్’​పై దృష్టి సారించనున్నారని సమాచారం. మరోవైపు ప్రశాంత్ ‘ఎన్టీఆర్ 31’ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనుందని మూవీటీమ్ ప్రకటించింది. దీంతో సలార్ 2 ఆగిపోయిందనే వార్తలు రోజు రోజుకు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఇంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది.