Movie News

సాయి పల్లవికి మాత్రమే ఆ ఘనత సాధించింది

ఫిదా మూవీ తో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి..తాజాగా ఎవరికీ దక్కని ఘనత సాధించింది. తాజాగా 2023 ఫిలిం ఫేర్ అవార్డ్స్ విజేతల లిస్ట్ విడుదలైంది. ఈ ప్రకటన లో సాయి పల్లవికి రెండు అవార్డ్స్ దక్కాయి. గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా, విరాటప‌ర్వం సినిమాకు తెలుగులో క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా రెండు భాషల్లోనూ పురస్కారాలను దక్కించుకుంది. దీంతో సౌత్‌ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు సార్లు ఫిలింఫేర్‌ అవార్డు దక్కించుకున్న హీరోయిన్​గా సాయి ప‌ల్ల‌వి నిలిచింది.

గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా, విరాటప‌ర్వం సినిమాకు తెలుగులో క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా రెండు భాషల్లోనూ అవార్డ్స్ దక్కించుకుంది. దీంతో సౌత్‌ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు సార్లు ఫిలింఫేర్‌ అవార్డు దక్కించుకున్న హీరోయిన్​గా సాయి ప‌ల్ల‌వి నిలిచింది.

సాయి ప‌ల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు చూస్తే..

ప్రేమ‌మ్ సినిమా – ఉత్త‌మ న‌టి (డెబ్యూ)

ఫిదా – ఉత్త‌మ న‌టి

ల‌వ్ స్టోరీ – ఉత్త‌మ న‌టి

శ్యామ్​ సింగ‌రాయ్ – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)

గార్గి – ఉత్త‌మ న‌టి

విరాట‌ప‌ర్వం – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)

సాయి పల్లవి ప్రస్తుత సినిమాల విషయానికొస్తే నాగచైతన్యతో కలిసి తండేల్ చిత్రంలో నటిస్తోంది. హిందీలో మరో రెండు సినిమాలు చేస్తోంది.