Movie News

జవాన్ హీరోయిన్ ను మెగా హీరో పెళ్లి చేసుకోబోతున్నాడా..?

ఇటీవల కాలంలో యంగ్ హీరోలు , హీరోయిన్స్ వరుసగా పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. ఈ క్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడని..అది కూడా ఓ హీరోయిన్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు మెహరీన్. మెహరీన్ – మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి జవాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారట.

దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో ఈ వార్త బాగా వినిపించింది. అయితే మెహరీన్ ప్రేమను సాయి ధరంతేజ్ ఒప్పుకోలేదని సమాచారం. అందుకే ఇద్దరూ డ్రాప్ అయ్యారు అని తెలుస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలుసుకున్నారని , అందుకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

గతంలో కూడా తేజ్.. హీరోయిన్ రెజీనాతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే తిక్క సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి తో కూడా ఎఫైర్ నడిపినట్లు వార్తలు వినిపించాయి. కానీ అవేవి కూడా నిజం కాలేదు. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ మెహరీన్ తో పెళ్లికి సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే ఈ విషయంపై వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.