Monday, December 23, 2024
HomeMovie News3Dలో రీ రిలీజ్ కాబోతున్న 'RRR'

3Dలో రీ రిలీజ్ కాబోతున్న ‘RRR’

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా మల్టీస్టారర్ మూవీ గా వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. మర్చి 24 , 2022 న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించడమే కాదు ఈ మూవీ లో నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం దక్కింది.

అలాంటి ఈ గొప్ప మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి 3D వెర్షన్ లో రిలీజ్ అవ్వడం విశేషం. ఈనెల (మే)10న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో తెలుగు, హిందీ భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ రీ రిలీజ్ కానుంది. దీంతో రాజమౌళి మూవీఫెస్ట్​ను 3Dలో ఎక్స్​పీరియన్స్ చేయవచ్చని మూవీలవర్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి శ్రియా శరణ్ బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్ ఒలివియ మోరిస్ తదితరులు నటించారు. డీవీవీ ఎంటర్టైన్​మెంట్ బ్యానర్​పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. మరి 3d వెర్షన్ లో ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read