Movie News

రోజా ప్రవర్తన చూసి ఛీ కొడుతున్నారు

సినీ నటి , మాజీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తన చూసి సినీ జనాలే కాదు నెటిజన్లు సైతం ఛీ కొడుతున్నారు. ఎమ్మెల్యే గా రెండు పర్యాలు నగరికి ఏమి చేయలేదని..పైగా జనాల సొమ్ము కాజేసిందని ఆరోపిస్తూ ఘోరంగా ఓడగొట్టారు నగరి ప్రజలు..ఇక ఇప్పుడు నెటిజన్లు సైతం ఈమె ప్రవర్తన చూసి ఛీ అంటున్నారు.

సమాజంలో మనం హాయిగా బతుకుతున్నామంటే అందుకు కొందరు శ్రమజీవుల కష్టమే కారణం. ఇందులో అందరి పాత్రా ఉంది. మన రోడ్లు, వీధులు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయంటే అందుకే పారిశుద్ధ్య కార్మికులే కారణం. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఇప్పటికీ అంటరానివారుగా అవమానాలను ఎదుర్కొంటూ, కొన్ని చోట్ల బహిష్కరించబడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రోజా కూడా వారిని అలాగే చూసి మీడియా లో నిలిచింది.

తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి తన భర్త సెల్వమణితో కలిసి హాజరైన రోజా.. స్వామి వారిని దర్శించుకున్నారు. స్వతహాగా సినీనటి కావడంతో పాటు తమిళనాడులోనూ ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఆలయంలో రోజాను చూసిన కొందరు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. వారందరిని నవ్వుతూ పలకరించిన రోజా.. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇంతలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు కూడా రోజాతో సెల్ఫీలు దిగాలని భావించి ఆమె వద్దకు పరిగెత్తుకొచ్చారు. వారిని గమనించిన రోజా దగ్గరకు రావొద్దు, దూరంగా జరిగి నిల్చోవాలంటూ చేతితో సైగలు చేశారు. దీంతో సదరు పారిశుద్ధ్య కార్మికులు దూరంగా ఉండే రోజాతో సెల్ఫీలు దిగారు. మిగితా వారితో రాసుకొని..పూసుకొని సెల్పీలు దిగారు. దాంతో ఆమె తీరును తప్పుపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. దీంతో మరోసారి నెటిజన్లకు , యాంటీ వైసీపీ వర్గాలకు అడ్డంగా దొరికిపోవడంతో వారు రోజాను చెడుగుడు ఆడుకుంటున్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>పారిశుధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ, అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన వైసీపీ నేత రోజా రెడ్డి. దుమ్మెత్తి పోస్తున్న తమిళ మీడియా. <a href=”https://t.co/3LmvNlOvT9″>pic.twitter.com/3LmvNlOvT9</a></p>&mdash; Telugu Desam Party (@JaiTDP) <a href=”https://twitter.com/JaiTDP/status/1813219505621115181?ref_src=twsrc%5Etfw”>July 16, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>