ఈ సినిమా చేయడానికి మిమ్మని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
-ప్రసన్న గారు ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్ గా వుంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్ కి కథ లో చాలా ఇంపార్టెన్స్ వుంది. నరేషన్ చాలా నచ్చింది. త్రూ అవుట్ నవ్వుతూనే వున్నాను.
సినిమాలో మీకు మెమరబుల్ మూమెంట్ అంటే ?
సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ వుంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
-ఇందులో యంగ్ కాలేజ్ గర్ల్ గా కనిపిస్తా. బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? సందీప్ క్యారెక్టర్ తో తన రిలేషన్ షిప్ ?.. ఇలా చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది.
సందీప్ కిషన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-సందీప్ గారు చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. చాలా ఎనర్జిటిక్ గా వుంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.
అన్షు గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ?
-తను చాలా పాజిటివ్ పర్శన్. చాలా హార్డ్ వర్కింగ్. తెలుగు క్లాసులు కూడా తీసుకుంది. తన కం బ్యాక్ గురించి నేనూ ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను.
సాంగ్స్ షూటింగ్స్ ఎలా జరిగాయి ?
-సాంగ్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. పాటలన్నీటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. రావులమ్మ పాట రాబోతోంది. ఆ పాట కూడా చాలా బావొచ్చింది.
డైరెక్టర్ త్రినాధ్ రావు గారి గురించి ?
-ఆయన చాలా జోవియల్ పర్శన్. చాలా ఎనర్జిటిక్ గా వుంటారు. అందరినీ అదే ఎనర్జీతో ఉంచుతారు. టీం అంతా చాలా పాజిటివ్ గా వుంటారు. ప్రతిరోజు ఒక పండగలా వుంటుంది. త్రినాధ్ రావు, ప్రసన్న వెరీ గుడ్ కాంబో. ప్రసన్న గారు ప్రతి రోజు సెట్ కి వచ్చేవారు. కామిక్ టైనింగ్ లో ఆయన చాలా పర్టిక్యులర్.
హాస్య మూవీస్ లో వర్క్ చేయడం గురించి?
-రాజేష్ గారు, అనిల్ గారు పాషనేట్ ప్రొడ్యూసర్స్. ఆడియన్స్ కి క్యాలిటీ సినిమా ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. వారి ప్రొడక్షన్ లో మరో సినిమా చేయాలని వుంది.
మీ డ్రీమ్ రోల్ ?
-నాకు యాక్షన్ రోల్ చేయాలని వుంది. అలాగే కామెడీ కూడా చేయడం నాకు చాలా ఇష్టం. అలాగే ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా చేయాలని వుంది.