Movie News

కల్కి థియేటర్ లో పవన్ ఫ్యామిలీ సందడి

ఎప్పుడెప్పుడు చూద్దామా..అని వెయ్యి కళ్లతో గత కొద్దీ రోజులుగా ఎదురుచూస్తున్న కల్కి మూవీ ..ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా నడుస్తుంది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ల దగ్గరకు చేరుకుని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకుపైగా స్క్రీన్స్​లో సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాను చూసేందుకు సినీ ప్రముఖులు సైతం పోటీ పడ్డారు. కల్కి సినిమా చూసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా ఉదయమే ప్రసాద్స్ ఐమాక్స్ కు చేరుకున్నారు. అకిరా ను చూసిన ఫ్యాన్స్ సెల్ఫీ కోసం పోటీపడ్డారు. రేణూ దేశాయ్‌తో కలిసి ఐమాక్స్‌ కు వచ్చిన అకీరా.. క‌ల్కి టీ ష‌ర్డు ధ‌రించి మ‌రీ సినిమా చూసేందుకు రావ‌డం విశేషం. సెల్ఫీల కోసం ఎక్కువమంది ఒకేసారి రావడంతో వెంటనే వేగంగా పార్కింగ్ నుంచి థియేటర్ లోపలికి వెళ్లిపోయారు అకీరా. ఆ సమయంలో లోపల రేణూ దేశాయ్ కూడా కనిపించారు. ఇక అకీరాను చూసిన ఆనందంలో ఫ్యాన్స్ మాములుగా గోల చేయలేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

Akira kuda manode Rebels 🔥🔥

Kalki Tshirt 💥#Blockbusterkalki #Kalki2898AD #Prabhas pic.twitter.com/ttxTXOo8hR— Roaring REBELS (@RoaringRebels_) June 27, 2024