తెలుగు వార్తలు

మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్


ప్రచోదయ ఫిల్మ్స్ పతాకం‌పై కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రదారులుగా ఏ. కె. జంపన్న దర్శకత్వంలో.. వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. అన్ని హంగులతో ముస్తాబైన ఈ చిత్రానికి సాయి కార్తీక్ స్వరాలను అందించారు. కాగా ఈ చిత్ర లిరికల్ సాంగ్‌ను ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లిరికల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తుందని, ఇప్పటికే వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ సాంగ్‌కి రావడం ఎంతో సంతోషంగా ఉందని చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మా చిత్రానికి మెయిన్ హైలైట్ సాయికార్తీక్‌గారు అందించిన సంగీతం. అది ప్రస్తుతం విడుదలైన లిరికల్ వీడియో సాంగ్‌తోనే ప్రూవ్ అయింది. అలాగే ఆయన అందించిన రీ రికార్డింగ్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. మాములుగా 1 మిలియన్ వ్యూస్ పొందాలంటే మాస్ బీట్ సాంగ్ లేదంటే లవ్ సాంగ్ అయితే.. అతి తొందరగా రీచ్ అయి వ్యూస్ సాధిస్తుంది. కానీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఒక స్ఫూర్తిదాయకమైన మా చిత్ర సాంగ్‌ ఇంత త్వరగా 1 మిలియన్ వ్యూస్ సాధించిందంటే అందుకు సాయి కార్తీక్ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే కారణం. భారీ తారాగణం, మంచి టెక్నీషియన్స్ ఉన్న ఈ సినిమా ‘జాగో’ పాటతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. అలాగే మా చిత్రంలో హీరో కిరణ్, అతుల్ కులకర్ణి మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎమోషన్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే చిత్రమిది. ‘జాగో’ పాట ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాం. పాటను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము..’’ అని అన్నారు.

రవికిరణ్, అతుల్ కులకర్ణి, దీపాలి శర్మ, శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి; డి.ఓ.పి: శ్యాం.కె. నాయుడు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్: మహేష్ శివన్, డాన్సు: భాను, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, పి.ఆర్.ఓ: వీరబాబు, ప్రొడ్యూసర్స్: వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు, స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏ. కె. జంపన్న.