Saturday, January 4, 2025
HomeMovie News'యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్' కు సపోర్ట్ గా ముందుకొచ్చిన రెబెల్ స్టార్

‘యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్’ కు సపోర్ట్ గా ముందుకొచ్చిన రెబెల్ స్టార్

సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్ నెస్ కార్యక్రమానికి తన మద్ధతు ప్రకటించారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ డ్రగ్స్ వద్దు అనే సందేశాన్ని అందించారు ప్రభాస్. తన మెసేజ్ తో కూడిన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఈ వీడియోలో

- Advertisement -

ప్రభాస్ స్పందిస్తూ – లైఫ్ లో మనకు బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనషులు, మన కోసం బతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్ ను ఈ రోజు నుంచే వదిలేయండి. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్ కు బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అని చెప్పారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read