Monday, December 23, 2024
HomeTop Storiesటిడ్కో ఇళ్ళు --పేదల ఆశల సౌధాలు

టిడ్కో ఇళ్ళు –పేదల ఆశల సౌధాలు

టిడ్కో గృహాలు పేదలపాలిట మహా సౌధాలు.. చిన్న కుటుంబాలు నివసించేందుకు అనువుగా డిజైన్ చేయబడిన ఈ ఫ్లాట్స్ వస్తే తాము తమ పిల్లా పాపలతో అక్కడ ఉందాం అని పేద, దిగువ మధ్యతరగతి జీవులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి . అయితే వీటిని ఎవరు నిర్మించారు.. ఎవరు వీటికోసం ఎక్కువ నిధులు కేటాయించారు. పేదలకు తక్కువ ధరకే, అంటే 300 అడుగులున్న చిన్న ఫ్లాట్స్ ఐతే ఉచితంగానే ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిగతా 365, 430 అడుగుల ఫ్లాట్స్ ను సగం ధరకే ప్రజలకు అందించారు .

- Advertisement -

ఇంకా అక్కడ తాగునీరు, రోడ్లు, విద్యుత్ ఇతర సౌకర్యాలకు సైతం భారీగా నిధులు విడుదల చేసిన సీఎం వైయస్ జగన్ లక్షలమంది కళ్ళలో సంతోషాన్ని విరబూయించేందుకు సకలం సిద్ధం చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు నిధుల్లో కనీసం పదిపైసల వంతు కూడా ఖర్చు చేయకుండానే అంతా తామే చేసాం అంటూ అక్కడ సెల్ఫీలు దిగి ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు, టిడిపి కార్యకర్తలు వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉంది.

టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే మొత్తం ఖర్చు చేయాల్సింది రూ.28వేల కోట్లపైనే. కాని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుచేసింది సగం కంటే తక్కువే. అలాంటప్పుడు తామే కట్టేశామని అనడం అవాస్తవం. వైయస్‌.జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటివరకూ రూ.8734 కోట్లు ఖర్చు చేసింది.

  1. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఇప్పటికే 62000 ఇళ్లు పూర్తి చేశారు.
  2. టిడ్కో ఇళ్లు మురికి కూపాలుగా మారిపోకుండా మౌలిక సదుపాయాలు కోసం దాదాపు మూడు వేలకోట్లు ఖర్చుపెట్టింది.
    రోడ్లు, సీవరేజి…ఇలా అద్భుతమైన నివాస సముదాయాలుగా మార్చింది.
  3. గత ప్రభుత్వం వదిలివెళ్లిపోయిన బిల్స్ రూ.3వేల కోట్ల బకాయిలు కూడా తీర్చింది.
  4. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు ఋణం చెల్లించాలి. అంటే ఇరవయ్యేళ్ళ తరువాత ఆ మొత్తం దాదాపు రూ. 7. 2 లక్షలు అవుతుంది.
  5. అయితే ఆ 300 అడుగుల ఇంటిని వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై భారం రూ. 5,340 కోట్లు. కానీ ప్రభుత్వం ప్రజలకోసం ఆ భారాన్ని భరిస్తోంది.
  6. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్‌ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ కూడా ప్రభుత్వం భరించింది. దీనిపై ప్రభుత్వంపై అదనపు భారం మరో రూ.482.31 కోట్లు.
  7. ఉచిత రిజిస్ట్రేషన్‌ రూపంలో రూ.1200 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది.
  8. 143600 మందికి ఒక్క రూపాయికే 300 అడుగుల ఫ్లాట్స్ మంజూరు
  9. 365, 430 అడుగులతో కలిపి మొత్తం ఫ్లాట్స్ 2. 62 లక్షలు
  10. సబ్సిడీల రూపంలో రూ. 14,514 కోట్లు
  11. ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్లు
  12. మొత్తం ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 18,714 కోట్లు
  13. ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించినవి 61,948
  14. ఈ ఏడాది చివరకు అందించే ఫ్లాట్స్ 2, 62, 216

ఇదీ వాస్తవం… ఈ యేడాడిచివరికి మొత్తం లబ్ధిదారుల ఇళ్లల్లో వెలుగులు నింపే లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read