Friday, October 18, 2024
HomeMovie News“బీస్ట్ మోడ్ ఆన్” అంటూ చరణ్ పోస్ట్

“బీస్ట్ మోడ్ ఆన్” అంటూ చరణ్ పోస్ట్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సంచలన డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. గత కొద్దీ నెలలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ రీసెంట్ గా పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమాకు ఓకే చెప్పాడు.

ఈ మధ్యనే ఈ మూవీ ప్రారంభోత్సవం జరుగగా..అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రాబోతున్నట్లు తాజాగా చరణ్ చేసిన ట్వీట్ చూస్తే అర్ధం అవుతుంది. చరణ్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో “బీస్ట్ మోడ్ ఆన్” అంటూ బ్యాక్ స్టిల్ ఒకటి పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుంది. చరణ్ అభిమానులు ఇప్పటికైనా కొత్త సినిమా స్టార్ట్ చేసాడు చాలు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ లో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడని తెలుస్తూనే ఉంది. RC16 రగ్గడ్ గడ్డంతో ఊర మాస్ గా కనిపించనున్నట్టు సమాచారం. పోస్ట్ చేసిన బ్యాక్ స్టిల్ లోనే రామ్ చరణ్ ని గమనిస్తే.. లైట్ గా గడ్డం, హెయిర్ కూడా పెంచినట్టు తెలుస్తుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read