Movie News

రష్మిక కు అలాంటి అబ్బాయి కావాలట

టాలీవుడ్ అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక తన జీవిత భాగస్వామి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అతను తన జీవితంలోని ప్రతీ మలుపులో, కష్టసమయంలో అండగా నిలబడి, నమ్మకంతో భద్రతనివ్వాలి, స్త్రీ-పురుష సంబంధాల్లో పరస్పర గౌరవం, నమ్మకం చాలా ముఖ్యమని చెప్పింది. ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంటే, జీవితాంతం కలిసి ఉండొచ్చు అని అభిప్రాయపడింది. అలాగే కోపతాపాలకు దూరంగా ఉండి, ఒకరినొకరు అర్థం చేసుకునే సహృదయత ఉండాలని కూడా ఆమె పేర్కొంది. జీవిత భాగస్వామిగా అలాంటి వ్యక్తి కావాలని ఆమె స్పష్టం చేసింది.

ప్రస్తుతం రష్మిక మందన్నవరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రాలు ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’, ‘సికందర్’, ‘ఛావా’ మరియు ‘కుబేర’ వంటి ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.