Movie News

సమంత కు షాక్ ఇచ్చిన రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక ఎక్కడ తగ్గడం లేదు..పుష్ప , యానిమల్ హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ భామ..ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అంతే కాదు ఇతర హీరోయిన్ల ఛాన్సులు కూడా కొట్టేస్తుంది. తాజాగా సమంత ఛాన్స్ ను ఈ భామ దక్కించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మయోసైటటిస్ కోసం తీసుకున్న బ్రేక్ తర్వాత సమంత ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ఆమె సినిమా నుంచి బ్రేక్ తీసుకోవడానికంటే ముందే ఒప్పుకున్నది. ఇక రీసెంట్ గా సామ్ పుట్టినరోజు సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇటీవల షారుక్ ఖాన్ నెక్ట్స్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది అంటూ రూమర్లు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇక అంతలోనే సమంత నటించిన ఓ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

హారర్ కామెడీ మూవీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రష్మిక మందన్నను వరించిందని తెలుస్తోంది. నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సూపర్ హారర్ కామెడీ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని టాక్ నడుస్తోంది. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ అండ్ హారర్ ఎంటర్టైనర్ షూటింగ్ 2024 చివర్లో మొదలు కాబోతోంది. ముందుగా ఈ మూవీ లో సమంత ను అనుకున్నారు..కానీ ఇప్పుడు సమంత ను పక్కన పెట్టి రష్మిక ను తీసుకున్నారు.