Monday, December 23, 2024
HomeMovie Newsవిజయ్ పేరు చెప్పగానే సిగ్గు పడిన రష్మిక

విజయ్ పేరు చెప్పగానే సిగ్గు పడిన రష్మిక

- Advertisement -

విజయ్ దేవరకొండ – రష్మిక వీరిద్దరి పేర్లు వింటే అభిమానుల్లో ఎక్కడాలేని సంబరం. గీత గోవిందం తో జోడి కట్టిన ఈ జంట..ఫస్ట్ మూవీ తోనే యూత్ ను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో మెప్పించారు. కాగా గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన ‘గం గం గణేశా’ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు రష్మిక మందన గెస్టుగా హాజరై సందడి చేసింది.

ఈ వేడుకలో ఆనంద్ యాంకర్‌గా మారి రష్మికను పలు ప్రశ్నలు అడిగారు. ​ “మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరంటూ” రష్మికను అందరి ముందు అడుగగా.. ఈ ప్రశ్న వినగానే వెనక నుంచి ఆడియన్స్ ‘రౌడీ బాయ్’ అంటూ అరవడంతో ఆమె సిగ్గుపడిపోయింది. ఇలాంటి ప్రశ్న అడుగుతావా ‘నీ అబ్బా’ అంటూ ఆనంద్‌ను సరదాగా తిట్టింది. “ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా ఇలా నన్ను స్పాట్‌లో పెడితే ఎట్లా అంటూ నవ్వుకుంది. ఫైనల్​గా రౌడీ(విజయ్ దేవరకొండ)” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read