Movie News

అనారోగ్యం తో బాధపడుతున్న రష్మిక

నేషనల్ క్రాష్ రష్మిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుస చిత్రాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఇక పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. పుష్ప దెబ్బ కు బాలీవుడ్ లో ఛాన్సులు దక్కించుకుంది. ఇక రణబీర్ తో చేసిన యానిమల్ మూవీ అమ్మడి జతకమే మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ అనారోగ్యం తో బాధపడుతుంది.

ప్రస్తుతం రష్మిక హైద్రాబాద్‌లోనే ఉంటుంది. ఇక్కడి వాతావరణం మారడంతో రష్మికకు ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది. రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు టేక్ కేర్ అంటూ కామెంట్లు అయితే పెడుతున్నారు. కానీ రష్మిక మాత్రం తన హెల్త్ అప్డేట్ ఏమీ ఇవ్వలేదు.. అసలేం జరిగిందో చెప్పలేదు. రష్మిక వేసిన పోస్ట్‌ను చూసి అభిమానులు అయితే కంగారు పడుతున్నారు.

ఇక రష్మిక బాలీవుడ్ ప్రాజెక్టుల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ భామకు సౌత్‌లో అంతగా క్రేజ్ లేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో బాలీవుడ్ వైపు చూస్తోంది. కన్నడలో అయితే రష్మిక ఎప్పుడో సినిమాలు చేయడం మానేసింది. కోలీవుడ్‌లో రష్మికకు అంతగా ఆఫర్లు రావడం లేదు. టాలీవుడ్‌లో వరుస ఫ్లాపులు రావడంతో కాస్త కెరీర్ డల్ అయింది. తెలుగు లో కేవలం పుష్ప 2 చేస్తుంది. ఇదికూడా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండడంతో ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి.