Movie News

పుష్ప జ్ఞాపకాలను పంచుకుంటూ రష్మిక ఎమోషనల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2 – ది రూల్’ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్​గా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ అంచనాలతో భారీ హిట్ అవ్వాలని అందరూ భావిస్తున్నారు. ‘పుష్ప 2’ ఫై ఉన్న అంచనాలు చూస్తుంటే..సినిమా వసూళ్లు రికార్డ్స్ బ్రేక్ చేస్తాయని చెప్పొచ్చు.

తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక పుష్ప షూటింగ్ జ్ఞాపకాలను పెంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ డిసెంబర్ నెలను తనకు ప్రత్యేకమైన నెలగా భావిస్తోంది. ఆమె గతంలో డిసెంబర్ లో విడుదలైన చిత్రాలన్నీ భారీ విజయాలను సాధించాయని చెప్పింది. ఆమె నటించిన ‘కిరాక్ పార్టీ’, ‘అంజనీపుత్ర’, ‘చమక్’ వంటి చిత్రాలు డిసెంబర్‌లోనే విడుదలై సూపర్ హిట్స్ అయ్యాయి. అదేవిధంగా ‘పుష్ప – ది రైజ్’ మరియు ‘యానిమల్’ కూడా డిసెంబర్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. “ఈ ఐదు సంవత్సరాలు పుష్ప సినిమా సెట్‌లోనే గడిచిపోయాయ”ని.. చిత్ర షూటింగ్ తనకు ఒక ఇంటిలా అనిపించిందని, ఇది ఓ ప్రత్యేకమైన అనుభవం అని చెప్పింది. అంతేకాకుండా, ఈ సినిమా కోసం పడిన కష్టాలు, ఆందోళనలు, చివరిలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే క్షణం ఆమెకు చాలా భావోద్వేగాలను కలిగించాయి.

‘పుష్ప 2’ షూటింగ్ ముగిసిన తరువాత, రష్మిక తన స్నేహితులతో, సినిమా టీమ్‌తో చెలామణి చేసిన సేపు వాటిని మిస్ అవుతానని చెప్పింది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసిన ఆనందాలు, అంగీకారాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని తెలిపింది.