Monday, December 23, 2024
HomeMovie NewsVD12 ఫస్ట్ లుక్ ఫై శ్రీవల్లి కామెంట్స్

VD12 ఫస్ట్ లుక్ ఫై శ్రీవల్లి కామెంట్స్

- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. అలాంటి విజయ్, ‘మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘VD12’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర బృందం.

తాజాగా శుక్రవారం ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా..ఆ లుక్ ఫై రష్మిక స్పందించింది. ఈ ఫస్ట్ లుక్‌ను షేర్ చేయడంతో పాటు ‘పిచ్చెక్కించేలా ఉంది’ (Madness) అంటూ పక్కనే ఫైర్ ఎమోజీ కూడా యాడ్ చేసింది రష్మిక మందనా. మామూలుగా విజయ్, రష్మికల్లో ఎవరి సినిమా విడుదలయినా కూడా ఒకరికొకరు వారి సపోర్ట్‌ను అందించుకుంటారు. ఆ సినిమాలపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దీంతో వీరు లవర్స్ అనే రూమర్స్ మరింత బలపడుతూ వస్తున్నాయి.

ఈ ఫస్ట్ లుక్‌లో విజయ్.. చిన్న హెయిర్ కట్‌తో కనిపిస్తున్నాడు. పైగా తన మొహం మీద రక్తం ఉంది. పెద్దగా అరుస్తున్నాడు. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చేయని ప్రయోగం ఏదో చేస్తున్నాడని అర్థమవుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read